ఏపీ ఫలితాలు: ఓటమి దిశగా కీలక నేతలు!

ఏపీ ఫలితాలు: ఓటమి దిశగా కీలక నేతలు!

ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి విజయం దిశగా దూసుకువెళుతోంది. ఇప్పటి వరకు వెలువడిన రౌండ్లలో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 

ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి విజయం దిశగా దూసుకువెళుతోంది. ఇప్పటి వరకు వెలువడిన రౌండ్లలో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.  దాదాపు కూటమి 155 స్థానాల్లో హవా సాధించడంతో టీడీపీ. జనసేన, బీజీపీ కార్యకర్తలు విజయ సంబరాలు చేసుకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 10 స్థానాల్లో టీడీపీ ముందంజలో ఉండగా.. ఒక స్థానంలో వైసీపీ ఆధిక్యంలో ఉన్నారు. అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఫలితాల్లో కూడా వైసీపీ అభ్యర్థులు పూర్తిగా నిరాశ పరిచారు. వైసీపీ మంత్రులు, కీలక నేతలు ఓటమి దిశగా సాగుతున్నారు. అందులో నగరి లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ బరిలో ఉన్న మంత్రి రోజా ఓటమి దిశగా వెళుతున్నారు. గాజువాక అసెంబ్లీ బరిలో మంత్రి అమర్‌నాథ్, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు, ఆముదాలవలసలో స్పీకర్ తమ్మినేని, మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రి దాడిశెట్టి రాజా, పెనుగొండలో మంత్రి ఉషా శ్రీ చరణ్, పుంగనూర్‌లో మంత్రి పెద్దిరెడ్డిలు వెనుకంజలో ఉన్నారు.    

 

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

 

 

 

 

Related Posts