వైసీపీ యువ నాయకుడు  దారుణ హత్య!

వైసీపీ యువ నాయకుడు  దారుణ హత్య!

అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. మదనపల్లె పట్టణంలోని శ్రీవారి నగర్‌లో వైసీపీ యువ నాయకుడు పుంగనూరు శేషాద్రి దారుణ హత్యకు గురయ్యాడు.

అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. మదనపల్లె పట్టణంలోని శ్రీవారి నగర్‌లో వైసీపీ యువ నాయకుడు పుంగనూరు శేషాద్రి దారుణ హత్యకు గురయ్యాడు. అర్థరాత్రి ఇంట్లో ప్రవేశించిన దుండగులు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. భార్య ముందే భర్తను కిరాతకంగా నరికి చంపేశారు.
 
విషయం తెలుసుకున్న మదనపల్లె డీఎస్పీ ప్రసాద్‌ రెడ్డి.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

Related Posts