ఇంట్లోకి కుక్క వచ్చిందంటూ డయల్-100కు కాల్... వీడియో వైరల్
ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే అప్రమత్తమై బాధితులను ఆదుకునేందుకు పోలీసు శాఖ ‘డయల్-100’ను ఏర్పాటు చేసింది. అయితే, ప్రస్తుతం డయల్-100’ను కొంతమంది అపహాస్యం చేస్తున్నారు.
ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే అప్రమత్తమై బాధితులను ఆదుకునేందుకు పోలీసు శాఖ ‘డయల్-100’ను ఏర్పాటు చేసింది. అయితే, ప్రస్తుతం డయల్-100’ను కొంతమంది అపహాస్యం చేస్తున్నారు. తాజాగా, ఓ వ్యక్తి డయల్-100కు కాల్ చేశాడు. విషయం ఏంటని పోలీసులు ప్రశ్నించగా.. మీరైతే త్వరగా రండి అంటూ హడావుడిగా ఫోన్ పెట్టేశాడు.
ఈ క్రమంలో ఏం జరిగిందోనని కాల్ చేసిన వ్యక్తి ఇంటికి పోలీసులు పరుగులు తీశారు. తీరా ఇంటికి వెళ్లాక అసలు విషయం బయటపడింది. కాల్ ఎందుకు చేశారని ఇంటి యజమానిని అడగ్గా.. ఇంట్లోకి కుక్క వచ్చిందంటూ సమాధానం చెప్పాడు. దీంతో పోలీసుల ఒక్కసారిగా ఖంగులిన్నారు.
ఈ క్రమంలో వారు ఇంటి యజమానిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా ఇంట్లోకి కుక్క వస్తే.. బయటకు వెళ్లగొట్టాలి, లేకపోతే గేటు పెట్టుకోవాలి. అంతే కానీ డయల్-100 కాల్ చేస్తారా అంటూ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.