ఛత్తీస్ గఢ్ అడవిలో అలజడి...ఎదురుకాల్పుల్లో జవాన్ మృతి
On
విశ్వంభర, వెబ్ డెస్క్ : ఛత్తీస్ గఢ్ అటవీ ప్రాంతాల్లో నక్సలైట్లు తిరుగుతున్నారనే పక్కా సమాచారంతో స్పెషల్ ఫోర్స్ అధికారులతో పోలీసుల కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే బేడా అటవీ ప్రాంతంలో మావోలు... పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగ్గా..అటవీ ప్రాంతం మొత్తం తుపాకీ శబ్దాలతో దద్దరిల్లిపోయింది. కాగా ఈ కాల్పుల్లో ఒక జవాను ప్రాణాలు కోల్పోగా మరో జవాన్ కి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags: A jawan was killed