గవర్నర్ సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చు: హైకోర్టు
On
విశ్వంభర, చెన్నై : ముడా స్కాం కేసులో కర్ణాటక సీఎం సిద్దరామయ్య పై విచారణకు ఆదేశించడంలో గవర్నర్ సొంత నిర్ణయం తీసుకోవచ్చని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది.దీంతో గవర్నర్ మంత్రివర్గం అభీష్టానికి లోబడి ఉండరని పేర్కొంది. మంత్రివర్గ అనుమతి లేకుండా గవర్నర్ తన పై విచారణకు ఆదేశించలేరని సీఎం కోర్టును ఆశ్రయించారు. సీఎం పై విచారణకు అనుమతి అనేది గవర్నర్ స్వతంత్ర నిర్ణయం. దీనిపై గవర్నర్ మంత్రివర్గ సలహాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు' అని కోర్టు పేర్కొంది.