SC వర్గీకరణ గొప్ప విజయం - మంత్రి ఉత్తమ్ పై సైదిరెడ్డి ఆగ్రహం 

SC వర్గీకరణ గొప్ప విజయం - మంత్రి ఉత్తమ్ పై సైదిరెడ్డి ఆగ్రహం 

విశ్వంభర, సూర్యాపేట: ఎస్సి వర్గీకరణ కోసం మందకృష్ట మాదిగ పోరాటం, ప్రధాని మోడీ సహకారంతో నేడు వర్గీకరణ విజయం సాధించిందని మాజీ ఎమ్మెల్యే  బీజేపీ పార్టీ నల్గొండ పార్లమెంట్ ఇంచార్జీ  శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణకై అలుపెరగని పోరాటం చేసినందుకు విజయాన్ని ముద్దాడినందుకు, మందకృష్ణ మాదిగకి, ఎస్సీ సామాజిక వర్గం మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని, మొదలు రేషన్ కార్డు ఆధారితం కాదని ఇప్పుడు రేషన్ కార్డు ను ఆధారంగా చేసుకొని ర్యాతులను మోసం చేస్తూ , నష్టపరిచే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పై దుయ్యబట్టారు. రైతు రుణమాఫీపై బిజెపి పార్టీ పోరాటం చేస్తోందని తెలుపుతూ ఎవరికైతే రైతు రుణమాఫీ కాలేదో వారికి  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ 8886100097 నెంబర్ ను  ఏర్పాటు చేయడం జరిగిందని  రుణమాఫీ రాకుండా ఉన్నటువంటి నిజమైన రైతులకి బిజెపి పార్టీ అండగా నిలుస్తుంది అని సైదిరెడ్డి పేర్కొన్నారు. హుజూర్నగర్ లో స్టాండు, ల్యాండు, రాజన్న అక్రమ రేషన్, యదేచ్చగా నడుస్తోందని, అక్రమంగా చెరువులో మట్టి తవ్వుతూ మత్స్యకారులకు ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారు.సివిల్ సప్లైలో  కోట్ల కొద్ది అవినీతి జరిగిందని గతంలో సీజ్ చేసిన ధాన్యాన్ని తరలించడం జరిగిందని ఎటువంటి విచారణ కూడా లేకుండా చేస్తున్నారని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరును వాడుతూ యదేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నట్టు.. దీనిపై వెంటనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించాలని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ సమావేశంలో మండల, పట్టణ అధ్యక్షులు  కోటిరెడ్డి,  రవి బీజేపీ నాయకులు  సోమిరెడ్డి, జనిగల శ్రీనివాస్, బెల్లంకొండ నాగరాజు, వెంకట శివ, హిందూజా, నాగరాజు తదితరులు పాల్గొన్నారు

Tags: