ప్రత్యంగిరా దేవాలయ ఆర్చ్ విద్యుత్ దీపాలంకరణ
On
విశ్వంభర, ఎల్బీనగర్ : ఆర్కే పురంలోని కుర్తాళ పీఠం శ్రీ ప్రత్యంగిరా పరమేశ్వరి దేవాలయ ఆర్చ్ దీపాలంకరణను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ 15 సంవత్సరాలు క్రితం నిర్మించిన కుర్తాల పీఠం శ్రీ ప్రత్యంగిరా పరమేశ్వరి దేవాలయ ఆర్చ్ వలన ఆర్కే పురం కాలనీ కి మంచి గుర్తింపు వచ్చిందని అమ్మవారు చాలా మహిమగల దేవతని, పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ సిద్దేశ్వరానంద భారతి మహాస్వామి వారు నేటితరం నడిచే దైవమని వారు తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ సెక్రెటరీ మునిపల్లె శ్రీనివాస్, కాలనీ ప్రతినిధులు శ్రీ రామారావు , వెంకటేశ్వర్లు , ఎ కెరెడ్డి, శ్రీశైలం, సంతోష్, విట్టల్ శర్మ , విప్లవ, అరుణ , హేమ, పాల్గొన్నారు.