గాంధీ చౌక్ లో పోలీసుల స్పెషల్ డ్రైవ్

గాంధీ చౌక్ లో పోలీసుల స్పెషల్ డ్రైవ్

విశ్వంభర, ఆమనగల్లు : ఆమనగల్లు మండల కేంద్రంలో సెల్ ఫోన్ దొంగతనాల ను అరికట్టడానికి ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నారు.  ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్లు పోతున్నాయని ఎక్కువగా ఫిర్యాదులు రావడంతో ఆమనగల్లు మండల కేంద్రంలో శుక్రవారం కూరగాయల సంత కావడంతో రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇదే అదనుగా సెల్ ఫోన్ దొంగతనాలు జరుగుతున్నాయని వీటిని అరికట్టడానికి మహాత్మా గాంధీ చౌక్ లో శుక్రవారం పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి తనిఖీలు చేశారు.  అత్యంత రద్దీ ఉండే స్థలాల్లో, బ్యాంకుల్లో, బస్టాండ్ లో, కూరగాయల మార్కెట్లో, సినిమా హాల్లో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సూచించారు.  అలాగే నెంబర్ ప్లేట్లు లేని హెల్మెట్లు లేని వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. 

 

Read More మహాపడిపూజ మహోత్సవంలో చిమ్ముల గోవర్ధన్ రెడ్డి

Tags: