తాండ్ర పాఠశాలకు ఐదు కోట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి కి పాలాభిషేకం
కల్వకుర్తి,విశ్వంభర :- జులై 30: కల్వకుర్తి మండలం తాండ్ర ఉన్నత పాఠశాలకు ఐదు కోట్లు ప్రకటించినందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాయితి ఆశాదీప్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తను చదువుకున్న పాఠశాల గుర్తుపెట్టుకుని కల్వకుర్తి బహిరంగ సభలో పాఠశాలను ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ గా అభివృద్ధి పరచడానికి ఐదు కోట్ల నిధులు మంజూరు చేశారని అందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశామని త్వరలో గ్రామస్తులంతా కలిసి బస్సుల్లో బయల్దేరి ముఖ్యమంత్రి నీ కలిసి కృతజ్ఞతలు తెలుపుతామని అందుకు అనుమతి (అపాయింట్మెంట్) కూడా సీఎం ఇచ్చారని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సుదర్శన్ రెడ్డి, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు