అవయవ దానం - మరో నలుగురి జీవితాలలో వెలుగులు

అవయవ దానం - మరో నలుగురి జీవితాలలో వెలుగులు

విశ్వంభర, రామన్నపేట : అశోక్ మరణం ఊరికే పోకుండా, మరో నలుగురి జీవితాలలో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ, మృతుడి కుటుంబ సభ్యుల అనుమతి, సహకారంతో మృతుడి అవయవాలు దానం చేసి, మరికొందరి జీవితాలలో వెలుగులు నింపడానికి ముందుకొచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల పరిధిలోని ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన రాస అశోక్ (39) గత మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. దుఃఖ  శోఖంలో ఉన్నప్పటికీ, ఆ కుటుంబం ముందుకు వచ్చి అవయవ దానానికి సహకరించిన కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పూస బాలకిషన్ ప్రగాఢ సానుభూతిని తెలిపి, కృతఙ్ణతలు తెలిపారు.  అనంతరం యశోద హాస్పిటల్ అధికారిక లాంచనాలతో గౌరవ వందనం స్వీకరించి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మదర్ డెయిరీ మాజీ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి, డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Tags: