800 కేజీల భారీగా గం**జాయి పట్టివేత

  800 కేజీల భారీగా గం**జాయి పట్టివేత

విశ్వంభర, శంషాబాద్ :  800 కేజీల భారీ గం**జాయిని కంటైనర్ లో తరలిస్తుండగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఓ ఆర్ ఆర్ పెద్ద గోల్కొండ వద్ద ఎస్ ఓ టి  పోలీసులు పట్టుకున్నారు.వీటి విలువ దాదాపు 2 కోట్ల 94 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. సైబరాబాద్ ఎస్ ఓ టి డీసీపీ డి.శ్రీనివాస్ పర్యవేక్షణ లో శంషాబాద్ డీసీపీ రాజేష్, అడిషనల్ డీసీపీ శోభన్ కుమార్, కె ఎస్.రావు ఏసీపీ శంషాబాద్, శివకుమార్ ఇన్స్పెక్టర్ శంషాబాద్, ఎస్ ఓ టి బాలానగర్, టిజిఎఎన్ బి టీం పాల్గొని చాకచక్యంగా గం**జాయి తరలిస్తున్న డీసీఎం కంటైనర్ ను పట్టుకున్నారు.800 కేజీల గం**జాయి కంటెయినర్ లో ఓ వాహనం ఒడిశా నుంచి మహారాష్ట్రకు హైదరాబాద్ మీదుగా వెళ్తున్నట్లుగా విచారణలో పోలీసులు గుర్తించారు.ఈ స్థాయిలో గం**జాయి తరలిస్తూ పట్టుబడటం ఇదే తొలిసారి అని పోలీసులు తెలిపారు.ఈ వ్యవహారంలో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.డీసీఎం డ్రైవర్ లు సంజీవ్ విఠల్ రెడ్డి  ,హోల్లప్ప,సప్లయర్ సునీల్ ఖోస్లా,జాగ సునాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరకుకు చెందిన వ్యక్తి గం**జాయి సరఫరాదారుగా ఉన్నాడని, అతని పేరు రాము అని తెలిపారు. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

Tags: