హిందువులు మేల్కోండి - గజ్వేల్ లో భారీ ఎత్తున హిందూ సంఘాల నిరసనలు
On
బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన దాడికి నిరసనగా ధర్నాలు , ర్యాలీలు
విశ్వంభర, గజ్వేల్ : బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన దాడికి నిరసనగా పార్టీలకు అతీతంగా, హైందవ హిందు సోదరుల ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలోని అంగడిపేట హనుమాన్ దేవాలయం నుండి కోర్టు వరకు ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్ లో హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడికి నిరసనగా హిందూ ఐక్యవేదిక పిలుపుమేరకు గజ్వేల్ పట్టణంలో వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. పట్టణంలో ప్రధాన వీధుల గుండా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పాదయాత్ర తో ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్ లో , హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా హిందూ ఐక్యవేదిక నాయకులు ఖండించారు.