మెగా రక్తదాన కార్యక్రమానికి ఉప్పలకు ఆహ్వానం
On
విశ్వంభర, హైద్రాబాద్ : ప్రముఖ సామాజిక కార్యకర్త మదర్ థెరిసా చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు చేపూరి శంకరయ్య ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మెగా రక్తదాన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో- కన్వీనర్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ను ఆయన నివాసంలో చేపూరి శంకరయ్య మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సామాజిక సేవ కార్యక్రమాలు చేసే ప్రతిఒక్కరికి అండగా ఉంటానని, ఇలాంటి గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్న మదర్ థెరిసా చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు చేపూరి శంకరయ్యను ఉప్పల శ్రీనివాస్ గుప్తా అభినందించారు.