స్వర్ణగిరి క్షేత్రాన్ని దర్శించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
On
విశ్వంభర, ఆత్మకూరు(ఎం): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య భువనగిరి మండలంలోని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యని సంప్రదాయం ప్రకారం ఆలయ డైరెక్టర్ మురళి కృష్ణ అర్చకులతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనం అందజేశారు.స్వామి వారి చిత్రపటం లడ్డు ప్రసాదం ఆలయ డైరెక్టర్ మురళి కృష్ణ అందజేశారు.ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారిని, జలనారాయన స్వామివారిని, కళ్యాణ మండపాన్ని, సందర్శించారు. తిరుపతి తరహాలో భువనగిరి స్వర్ణగిరి ఆలయంలో ఆధ్యాత్మికం ఉట్టిపడేలా ఉందన్నారు.