ఎమ్మెల్యే కోమటిరెడ్డి పై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ఆగ్రహం 

ఎమ్మెల్యే కోమటిరెడ్డి పై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ఆగ్రహం 

బిఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులుకు గురి

విశ్వంభర, మునుగోడు నియోజకవర్గం : మునుగోడు మాజీ ఎమ్మెల్యే  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పై మండిపడ్డారు.  మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి ఎన్నికై  ఎనిమిది నెలలు గడుస్తున్నా నియోజకవర్గానికి నిధులు తీసుకురావడంలో విఫలం అయ్యారని ఎద్దేవా చేసారు. తానూ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధికి 50 కోట్ల రూపాయలు, మండల అభివృద్ధికి 25 కొట్ట రూపాయలు జిహెచ్ఎంసి నిధులు తీసుకువచ్చి శంకుస్థాపనలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని గుర్తు చేసారు. ఇప్పుడు ఆ పనులు ఎక్కడికక్కడ నిలిపివేసి ఇంకా ముందుకు తీసుకువెళ్లకుండా రాజగోపాల్ రెడ్డి నిర్లక్ష్యం గా వ్యవహరించడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేసారు. బి ఆర్ ఎస్ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేస్తున్నారు కానీ అభివృద్ధి పనులు మాత్రం చేయట్లేదని దుయ్య బట్టారు. 

Tags: