ఆర్కే పురంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
ఎల్బీనగర్, విశ్వంభర:- మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం శాసన సభ్యురాలు సబితా ఇంద్రా రెడ్డి మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వాక్యాలకు నిరసనగా ఆర్కే పరం డివిజన్ బిఆర్ఎస్ యూత్ వింగ్ మాజీ అధ్యక్షుడు శ్యాంసుందర్ గుప్తా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు . ఈ సందర్భంగా శ్యాంసుందర్ గుప్త మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో ఉండి గౌరవమైన స్థానాన్ని పొంది సంస్కార రహితంగా ప్రవర్తించడం సబబు కాదని, ముందు మహిళలను గౌరవించడం నేర్చుకోవాలన్నారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతినిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై అలుపెరగాకుండా పనిచేస్తున్న సబితా ఇంద్రారెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మంచి పద్ధతి కాదన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ బి అర్ ఎస్ వి అధ్యక్షుడు పగడాల దీపక్, మైనార్టీ నాయకుడు రహీం,శ్రీనాథ్ యాదవ్, లోకి, హరీష్, నరేందర్, గని తదితరులు పాల్గొన్నారు.