వికలాంగుల వాయిస్ పత్రికను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సంఘం ఆధ్వర్యంలో వికలాంగుల వాయిస్ మాసపత్రికను జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వికలాంగుల కోసం ప్రత్యేకంగా మాసపత్రిక తేవడం అభినందనీయమని అన్నారు. వికలాంగులకు పోలీస్ శాఖ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వికలాంగుల సంఘం నాయకులు మాట్లాడుతూ, జిల్లాలో అనేక వికలాంగుల సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయని అన్నారు. ఇటీవల కాలంలో అత్యున్నత సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో నకిలీ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు సాధించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోట్ల గౌతమ్, ప్రధాన కార్యదర్శి పులిజాల బాలీశ్వర్, జిల్లా కమిటీ నాయకులు ఆనంద్, కుర్మయ్య, లింగం గౌడ్, గని మోని ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.