చెంగిచెర్ల లో ఘనంగా బోనాల పండుగ

చెంగిచెర్ల లో ఘనంగా బోనాల పండుగ

విశ్వంభర, బోడుప్పల్ :  మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్ల లో బోనాల పండగ అంగరంగ వైభవంగా పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్బంగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చెంగిచెర్ల గ్రామ పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ కొత్త రవి గౌడ్ ఆధ్వర్యంలో మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, బోడుప్పల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవ రెడ్డి చెంగిచెర్ల లోని పోచమ్మ దేవాలయాన్ని సందర్శించి పోచమ్మతల్లినీ దర్శించుకున్నారు.ఈ సందర్బంగా మల్లారెడ్డి మాట్లాడుతూ చెంగిచెర్ల ప్రజలకు ముందుగా బోనాల పండగ శుభాకాంక్షలు తెలిపారు. అంగరంగ వైభవంగా తెలంగాణ లో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న బోనాల పండుగ మన సాంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలా బోనాల పండగ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు మేక శ్రీనివాస్ యాదవ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags: