ఆగస్టు 1న " చంద్రబాబు పాలన -  రాష్ట్ర పురోగతి "  

ఆగస్టు 1న

- తెలుగు శక్తి ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సు 

- పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్

WhatsApp Image 2024-07-28 at 14.54.28 విశాఖపట్నం,విశ్వంభర : కూటమి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు పూర్తవుతున్న సందర్భంగా తెలుగు శక్తి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నారు.  "   చంద్రబాబు పాలన - రాష్ట్ర పురోగతి " పేరుతో ఆగస్టు 1న హోటల్ దశపల్లా వేదికగా ఉదయం 10 గంటల నుంచి ప్రత్యేక సదస్సు నిర్వహిస్తారు. ఈ సదస్సుకు సంబంధించిన పోస్టర్ ను ఆదివారం.. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ..  తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే సదస్సులో అన్ని రంగాల ప్రముఖులు పాల్గొంటారన్నారు. అదే విధంగా విశాఖ అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పి.వి. వసంతరావు, సీ.ఎం.రమణ, బొచ్చ రామిరెడ్డి, భద్రరావు, ఎం.తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

 

Read More ముఖ్యమంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం

 

Read More ముఖ్యమంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం

Tags: