అసెంబ్లీ నియమావళి కి  విరుద్ధం -  డా ఎర్రోళ్ల శ్రీనివాస్

అసెంబ్లీ నియమావళి కి  విరుద్ధం -  డా ఎర్రోళ్ల శ్రీనివాస్

విశ్వంభర, హైద్రాబాద్ : PAC(public Accounts Committee) చైర్మన్ గా అరికాపూడి గాంధీని నియమించడం అసెంబ్లీ నియమావళి కి  విరుద్ధం అప్రజాస్వామికం అని డా.  ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. Rule 250 ప్రకారం 9 మంది PAC సభ్యులను అసెంబ్లీ నుండి ఎన్నుకోవాలి అని అన్నారు. BRS సభ్యుల సంఖ్య PAC committee ఏర్పాటు చేసే నాటికి 38 ముగ్గురు సభ్యులు BRS నుండి PAC లో ఉండాలి. కానీ ఆ ముగ్గురు సభ్యులను 38 మంది BRS ఎంఎల్ఏ లు రూల్ 250 అనుసరించి ఎన్నుకోవాల్సి ఉంటుంది. పార్టీ ఫిరాయించిన అరికపూడి గాంధిని  BRS కు చెందిన  ఎంఎల్ఏలు proportional representation ద్వారా ఎలా  ఎన్నుకున్నారో స్పీకర్ గారు చెప్పాలి అని ప్రశ్నించారు. 1958-59 నాటి నుండి ప్రతిపక్ష నాయకుని PAC చైర్మన్ గా ఎన్నుకోవడం ఆనవాయితీ ఉందని,  స్పీకర్ పార్టీ ఫిరాయించిన ఆరికపూడి గాంధీ ఎన్నికను ఎలా ఆమోదిందించారు..? అని మండి పడ్డారు . ఈ విధంగా స్పీకర్  నియమించడం అసెంబ్లీ నియమావళి కి విరుద్ధం అని అన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం సభా మర్యాదలు పాటించకుండా  సొంత నిర్ణయాలు తీసుకుంటూ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుండడం సరికాదని దుయ్యబట్టారు.  ప్రజలు అన్ని గమనిస్తున్నారు ,ప్రజాసమస్యలపై పోరాడే అసెంబ్లీ లో కూడా రాజకీయాలు చేయడం సరి కాదు అంటూ  ఇప్పటికైనా సరియైన నిర్ణయాలు తీసుకోవాలి అని హెచ్చరించారు.  ప్రజలు అన్ని చూస్తున్నారు అని అన్నారు 

 

Read More బీసీ నేతకే పీసీసీ పీఠం...! రేసులో మహేష్ కుమార్ గౌడ్ ?

Tags: