మొట్టమొదటిసారిగా 40 అడుగుల భారీ విగ్రహం -
వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం ఎల్లమ్మ బజార్ లో భద్రకాళి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి విగ్రహం ఏర్పాటు
విశ్వంభర, వరంగల్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ తరహాలో మొట్టమొదటిసారిగా వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం ఎల్లమ్మ బజార్ లో భద్రకాళి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆకుతోట సంజీవ్ మొట్టమొదటిసారిగా 40 అడుగుల ఎత్తులో భారీ గణపతి విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విలేకరుల సమావేశంలో విగ్రహా పోస్టర్ ను ఆవిష్కరింపజేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలను ప్రోత్సహించి వాతావరణ కాలుష్య నివారణకు ఎంతగానో తోడ్పడుతుందని ఉత్సవ కమిటీ సభ్యులు సంజీవ్ తెలిపారు. వినాయక విగ్రహాలను ప్రతిష్టింపజేసే ప్రతి ఒక్కరు, భక్తులు ఉత్సవ కమిటీ సభ్యులు మట్టి విగ్రహాలను ఉపయోగించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రతి రోజూ హోమా కార్యక్రమాలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు.