తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం కేటాయించాలి - డాక్టర్ పిడమర్తి రవి
విశ్వంభర, హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరికి 250 గజాల ఇంటి స్థలం ప్రభుత్వం తక్షణమే కేటాయించాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తెలంగాణ విద్యార్థి జేఏసీ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ న్యూ సెమినార్ హాల్లో నిర్వహించిన మలిదశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొని ప్రసంగించారు డాక్టర్ పిడమర్తి రవి. ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో సముచిత స్థానం లభించాలని, ఉద్యమంలో ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా రాష్ట్రం కోసం కొట్లాడిన వందలాది ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వంలో త్వరలో నిర్వహించబోయే నామినేటెడ్ మరియు వివిధ పార్టీ పదవులు కల్పించాలని ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 250 గజాల ఇంటి స్థలాన్ని ఉద్యమకారులకు వెంటనే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బట్టు శ్రీహరి, లోకేష్ యాదవ్, చరణ్, కౌశిక్ యాదవ్, శ్రీధర్ గౌడ్, దరువు ఎల్లయ్య, వరంగల్ రవి, కోట శ్రీనివాస్ గౌడ్, దుర్గం భాస్కర్, బోరెల్లి సురేష్, రెడ్డి శ్రీనివాస్,జాన్, నోముల వంశీ యాదవ్, బుర్ర సురేష్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు