ప్రముఖ సినీ గీత రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూత
On
విశ్వంభర, హైద్రాబాద్ : ప్రముఖ సినీ గీత రచయిత వడ్డేపల్లి కృష్ణ (76) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. వడ్డేపల్లి కృష్ణ కవి, సినీ గేయ రచయిత, లతితగీతాల రచయితగా రాణించారు. ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా’ గీతంతో వడ్డేపల్లి కృష్ణ ప్రఖ్యాతిగాంచారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు నివాళులర్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు కవులు, కళాకారులు, రచయితలు సంతాపం ప్రకటిస్తున్నారు. కిన్నెరకు ఆప్తుడు వడ్డేపల్లి కృష్ణ ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కిన్నెర తెలియచేస్తున్నది