బీహార్ లో నలంద యూనివర్సిటీని ప్రారంభించిన ప్రధాని మోడీ

బీహార్ లో నలంద యూనివర్సిటీని ప్రారంభించిన ప్రధాని మోడీ

విశ్వంభర, బీహార్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ  బీహార్ లో నూతనంగా నిర్మించిన నలంద యూనివర్సిటీ క్యాంపస్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 17 దేశాల రాయబారులతో పాటు కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జై శంకర్​ కూడా హాజరయ్యారు. ప్రారంభోత్సవానికి ముందు నలంద విశ్వవిద్యాలయానికి చెందిన పురాతన శిథిలాలను ప్రధాని మోదీ సందర్శించారు. భారత వారసత్వ సంపద లో ఒకటిగా గుర్తించబడిన ఆ ప్రదేశంలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలనే ప్రతిపాదనను తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో సభ్య దేశాలు ఆమోదించాయి.  

ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ... నలంద విశ్వవిద్యాలయం భారతీయ ఆత్మ వంటిదని నలంద అంటే జ్ఞానాన్ని అందించే విద్యా కేంద్రం అని అన్నారు. నాడు ప్రపంచలోనే ఓ ప్రముఖ విద్యాకేంద్రంగా నలంద విశ్వవిద్యాలయం విరాజిల్లిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఒకప్పుడు విదేశాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకున్నారని తెలిపారు.

Read More పండుగలు సాంప్రధాయానికి ప్రతీకలు: సెక్రటరీ సుదర్శన్ రెడ్డి.