మోడీ ప్రమాణ స్వీకారానికి వచ్చే వివిధ దేశాల అధ్యక్షులు వీరే..!

మోడీ ప్రమాణ స్వీకారానికి వచ్చే వివిధ దేశాల అధ్యక్షులు వీరే..!

ప్రముఖ హోటళ్ల వద్ద భారీ బందోబస్తు

 

విశ్వంభర, ఢిల్లీః భారతదేశానికి మూడోసారి ప్రధానిగా నరేంద్రమోడీ ఇప్పటికే ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రమాణస్వీకారానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఈ వేడుక రేపు అంటే జూన్ 9న రాత్రి 7:15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరగబోతుంది. కాగా ఈ వేడుకకు వివిధ దేశాల అధ్యక్షులకు ఆహ్వానం కూడా వెళ్లింది.

Read More రాజ‌కీయాల‌కు లోక్ మంథ‌న్ అతీతం::కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఆహ్వానం అందుకున్న వారంతా ఇప్పటికే తమ రాకను ధృవీకరించారు. దాంతో ఢిల్లీలోని ప్రముఖ లీలా, తాజ్, ఐటీసీ మౌర్య, క్లారిడ్జ్, ఒబెరాయ్ లాంటి ప్రధాన హోటళ్ల దగ్గర అతిథులకు విడిది ఏర్పాటు చేస్తున్నారు. వారందరికీ ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌ ప్రధాని, సీషెల్స్‌ అధ్యక్షుడు ఈరోజు న్యూఢిల్లీకి బయలు దేరారు. 

మిగతా వారంతా రేపు సాయంత్రానికల్లా ఢిల్లీకి చేరుకుంటారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు. ఈ కార్యక్రమం సార్క్(సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్) సభ్య దేశాల మధ్య ప్రాంతీయ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది.

అయితే మోడీ ప్రమాణస్వీకారానికి శ్రీలంక అధ్యక్షుడు- రణిల్ విక్రమసింఘే, మాల్దీవుల అధ్యక్షుడు- మహ్మద్ ముయిజ్జూ, సీషెల్స్ ఉపాధ్యక్షుడు- అహ్మద్ అఫీఫ్, బంగ్లాదేశ్ ప్రధాని-షేక్ హసీనా, మారిషస్ ప్రధాని- ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, నేపాల్ ప్రధాన మంత్రి- పుష్ప కమల్ దహాల్ ‘ప్రచండ’, భూటాన్ ప్రధాని-షెరింగ్ టోబ్గే రాబోతున్నారు.

Related Posts