ఎయిర్ ఇండియా విమానంలో మంటలు.. అత్యవసర ల్యాండింగ్..!
బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటల చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని బెంగళూరులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటల చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని బెంగళూరులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 179 మంది ప్రయాణికులతోపాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు.
విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను వెంటనే దింపడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి 11.12 గంటలకు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా IX 1132 విమానం కొచ్చికి బయల్దేరింది. ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుడివైపు ఉన్న ఇంజిన్‌లో మంటలంటుకున్నాయి. ఇది గుర్తించిన సిబ్బంది వెంటనే ఆ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)కు చేరవేశారు.
విమానం ల్యాండ్ కావడానికి ముందే అగ్నిమాపక సిబ్బందిని రన్‌వేపై సిద్ధంగా ఉంచారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను సురక్షితంగా కిందికి దింపినట్టు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. ప్రయాణికులు అందరూ క్షేమంగా ఉన్నారని తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అంతరాయానికి చింతిస్తున్నాని చెప్పింది. కాగా, విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని ప్రకటించింది.
Kochi-bound Air India Express flight with 179 passengers makes emergency landing in Bengaluru after engine catches fire@AirIndiaX @BLRAirporthttps://t.co/8FWyotoh1v pic.twitter.com/jifx6nQSYh
— ChristinMathewPhilip (@ChristinMP_) May 19, 2024