తాత జయంతి.. జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ వైరల్

తాత జయంతి.. జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ వైరల్

ఇవాళ దివంగత నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు, కుటుంబ సభ్యలు ఆయనను తలుచుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు.

ఇవాళ దివంగత నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు, కుటుంబ సభ్యలు ఆయనను తలుచుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఉదయాన్నే హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు. 

తాతకు తగ్గ మనవడుగా జూనియర్ ఎన్టీఆర్ సినీ రంగంలో దూసుకుపోతున్నారు. కాగా, ప్రపంచ స్థాయిలో ఎన్టీఆర్ గుర్తింపు సాధించారు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ తన తాతయ్య జయంతి సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేశారు. ‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను, మరొక్కసారి తాకిపో తాత సదా మీ ప్రేమకు బానిసను’. అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read More క్రీడల వల్ల విద్యార్థులలో స్నేహభావం పెరుగుతుంది : డా.  కోడి శ్రీనివాసులు