అమెరికాలో భారీ వర్షాలు... నలుగురు దుర్మరణం

అమెరికాలో భారీ వర్షాలు... నలుగురు దుర్మరణం

విశ్వంభర, వెబ్ డెస్క్ : అమెరికా హ్యూస్టన్ నగరంలో భారీ వర్షాలు పడ్డాయి. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తుండంతో... ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెట్టు పెద్ద సంఖ్యలో విరిగిపడ్డాయి. వర్షాల ధాటికి జరిగిన ప్రమాదాల్లో మొత్తం నలుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. భారీ వర్షాల కారణంగా విమానాశ్రయాలు, పాఠశాలలు మూతపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇళ్లు, వ్యాపార కేంద్రాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో హ్యూస్టన్ నగర వాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

Related Posts