పట్టుబట్టి ఏడు మండలాలు ఏపీలో కలిపా

పట్టుబట్టి ఏడు మండలాలు ఏపీలో కలిపా

 

ఆ మండలాల్లోనే ఇప్పుడు పోలవరం కడుతున్నాం
సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

 

ఏపీ విడిపోయిన సమయంలో తెలంగాణలోని ఏడు మండలాలను తాను పట్టుబట్టి మరీ ఏపీలో కలపానని సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టును కూడా ఆ మండలాల్లోనే కడుతున్నామని వివరించారు. సోమవారం నాడు ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అక్కడి పరిస్థితులపై విచారం వ్యక్తం చేశారు. 

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

2019లో మేం దిగిపోయే నాటికి 72శాతం పనులు పూర్తి చేశానం. కానీ వైసీపీ హయాంలో పూర్తిగా నాశనం చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును పూర్తి చేసి అనుసంధానం చేయలేకపోయారని విమర్శించారు. ఆ రోజు నేను పోలవరాన్ని ఏపీలో ఉంచడం కోసం పట్టుబట్టి ఢిల్లీలో మాట్లాడి మరీ ఏడు మండలాలను ఏపీలో కలిపానని గుర్తు చేశారు. 

అలా తను ఏపీకి పోలవరాన్ని తీసుకొచ్చినట్టు చెప్పారు చంద్రబాబు నాయుడు. నోటిఫై అయ్యాక తెలంగాణ ఒప్పుకుంటేనే ఆ ఏడు మండలాలు ఏపీలో కలుస్తాయి కాబట్టి.. నోటిఫై కాక ముందే పట్టుబట్టి మరీ ఏడు మండలాలను ఏపీలో తాను కలిపినట్టు చెప్పుకొచ్చారు. దేశ చరిత్రలో ఇలా జరుగడం ఇదే ప్రథమమన్నారు. అలా తాను ఏపీకి పోలవరాన్ని తెస్తే వైసీపీ పార్టీ దాన్ని నాశనం చేసిందని ఆగ్రహం తెలిపారు.