తెలంగాణ సచివాలయంలో ఆంధ్రా ఉద్యోగుల పెత్తనం..?

తెలంగాణ సచివాలయంలో ఆంధ్రా ఉద్యోగుల పెత్తనం..?

  • సెక్షన్ ఆఫీసర్ల నియామకానికి నిర్ణయం 
  • రాష్ట్రానికి వస్తున్న 1800 మంది ఏపీ ఉద్యోగులు 
  • తెలంగాణ ఉద్యోగుల మండిపాటు

తెలంగాణ సచివాలయంలో సెక్షన్ ఆపీసర్లుగా ఏపీ ఉద్యోగులను నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రేవంత్‌ సర్కార్‌ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఏపీ స్థానికత ఉన్నప్పటికీ వేర్వేరు కారణాలతో ఆంధ్రా ఉద్యోగులను తెలంగాణకు రప్పిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సుమారు 1800 మంది ఉద్యోగులను రాష్ట్ర సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్లుగా నియమించనున్నట్లు తెలుస్తోంది. 

దీంతో తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్లుగా 40 మంది, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లుగా 20 మంది మారనున్నట్లు సమాచారం. ఇప్పటికే చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఈ నియామకానికి సంబంధించిన ఫైల్‌ను సీఎం రేవంత్ రెడ్డి టేబుల్‌పై ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో ఈ ప్రయత్నం జరిగినపుడు మాజీ సీఎం కేసీఆర్ నిరాకరించారట. ఇక సచివాలయంలో ఆంధ్ర ఉద్యోగుల పెత్తనం చెలాయించడానికే ఇలా నియమిస్తున్నారంటూ తెలంగాణ ఉద్యోగులు మండిపడుతున్నారు.

Read More జిల్లాను లెప్రసి రహిత జిల్లాగా ప్రకటించాలి