ప్రేమికుడి మోసం.. 14 పేజీల లేఖ రాసి యువతి ఆత్మహత్య

ప్రేమికుడి మోసం.. 14 పేజీల లేఖ రాసి యువతి ఆత్మహత్య

హైదరాబాద్‌లో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని ఆరోపిస్తూ ఆమె ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలు ఓ లెటర్ రాసి ఉరివేసుకుని మృతి చెందింది.

 

Read More అద్దంకి నార్కట్ పల్లి  హైవేపై నందిపాడులో  బస్ బోల్తా - పలువురికి తీవ్ర గాయాలు 

జీడిమెట్లలో ఎల్ఎల్బీ నగర్‌లో ఉండే బాలబోయిన అఖిల అనే యువతి ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. గత కొన్నేళ్లుగా షాపుర్ నగర్‌కు చెందిన అఖిల్ సాయిగౌడ్ అనే యువకుడు అఖిల వెంట పడేవాడు. తనకు ఇష్టం లేదని చెప్పినా వినకుండా ఆమె వెంట పడేవాడు. ఈ విషయం అఖిల తన పేరెంట్స్ కు చెప్పింది. దీంతో.. అఖిల కుటుంబ సభ్యులు అఖిల్ సాయిగౌడ్‌ను పిలిచి మాట్లాడారు. అఖిలను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. 

 

Read More అద్దంకి నార్కట్ పల్లి  హైవేపై నందిపాడులో  బస్ బోల్తా - పలువురికి తీవ్ర గాయాలు 

ఈ వ్యవహారం మొత్తం 8 ఏళ్లుగా నడుస్తోంది. అయితే.. గత నాలుగు నెలలుగా అఖిలకు వేధింపులు మొదలయ్యాయి. ప్రతీ చిన్న విషయానికి రోడ్డుపైనే కొట్టేవాడు. దీనికి తోడు.. పెళ్లి చేసుకోవడానికి కూడా నిరాకరించాడు. దీంతో.. ఆమె మోసపోయానని ఆవేదనతో 14 పేజీల లేటర్ సారి ఉరివేసుకుని చనిపోయింది. తమకు న్యాయం చేయాలని అఖిల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.