జూనియర్ ఎన్టీఆర్ ప్లాట్ కొనుగోలు వివాదంలో ట్విస్ట్..!

జూనియర్ ఎన్టీఆర్ ప్లాట్ కొనుగోలు వివాదంలో ట్విస్ట్..!

ప్లాట్ కొనుగోలు వివాదంలో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించినట్లు వస్తున్న వార్తలపై ఆయన టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది.

ప్లాట్ కొనుగోలు వివాదంలో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించినట్లు వస్తున్న వార్తలపై ఆయన టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రాపర్టీని ఎన్టీఆర్ 2013లోనే విక్రయించారని తెలిపింది. ఇక నుంచి ఆ ప్రాపర్టీకి సంబంధించిన వార్తల్లో ఆయన పేరును ఉపయోగించకూడదని సూచించింది. 

కాగా, హైకోర్టును జూనియర్ ఎన్టీఆర్ ఆశ్రయించినట్లు ఉదయం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఒక ల్యాండ్‌కు  సంబంధించిన వివాదంలో హైకోర్టును తారక్ ఆశ్రయించాడని సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. 2003లో సుంకు గీత అనే మహిళ నుంచి ఈ స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారు. అయితే, ఆ భూమిని ఎన్టీఆర్‌కు అమ్మిన వ్యక్తులు 1996లోనే దాన్ని తమ వద్ద తాకట్టు పెట్టి రుణం పొందారని ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్యాంకులు డెట్ రికవరీ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాయి.

Read More వంటగది ప్రాంతాన్ని పరిశీలించిన ఎస్ ఐ

దీనిపై విచారణ జరిపిన ట్రైబ్యునల్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ స్థలంపై బ్యాంకులకే హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. మరోవైపు తనకు స్థలాన్ని విక్రయించిన గీతపై పోలీస్ స్టేషన్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదు చేశారు. దీంతో, ఆమెపై కేసు నమోదైంది. అయితే, ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై తారక్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ జే శ్రీనివాసరావు, జస్టిస్ సుజోయ్ పాల్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ట్రైబ్యునల్ ఆర్డర్ కాపీ అందుబాటులో లేకపోవడంతో తమకు సమయం కావాలని తారక్ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. దీంతో జూన్ 6కు తదుపరి విచారణను వాయిదా వేసింది.

ఇదిలా ఉంటే ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ టీమ్ తాజాగా స్పందించింది. ఎన్టీఆర్‌కు సంబంధించి ఇవాళ వచ్చిన వార్తలకు ప్రతిస్పందనగా ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపింది. ఆ ప్రాపర్టీని ఎన్టీఆర్ 2013లోనే విక్రయించారని వెల్లడించింది. ఇక నుంచి ఆ ప్రాపర్టీకి సంబంధించిన వార్తల్లో ఆయన పేరును ఉపయోగించకూడదని సూచించింది.