టీ బీజేపీ అధ్యక్షుడి మార్పు.. ఆయనకే పగ్గాలు..?

టీ బీజేపీ అధ్యక్షుడి మార్పు.. ఆయనకే పగ్గాలు..?

 

విశ్వంభర, హైదరాబాద్ః కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. దాంతో ఇప్పుడు చాలా మంది కొత్త వారికి కేంద్రంలో మంత్రి పదవులు దక్కాయి. ఇక తెలంగాణ నుంచి సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు మంత్రి పదవులు దక్కాయి. ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు. అయితే ఆయనకు ఇప్పుడు కేంద్రమంత్రి పదవి దక్కింది. 

Read More  వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తుమ్మలపల్లి గ్రామంలో  ఇంటింటి సర్వే 

బీజేపీలో ఎవరికైనా ఒకటే పదవి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చబోతున్నారని తెలుస్తోంది. కాగా కిషన్ రెడ్డి తర్వాత బీజేపీలో కీలకంగా ఉన్న బండి సంజయ్ కు కూడా కేంద్రమంత్రి పదవి వచ్చింది కాబట్టి.. తెలంగాణలో క్లీన్ ఇమేజ్ ఉన్న నేతకు పదవి ఇవ్వాలని చూస్తున్నారు. 

దాంతో ఈటల రాజేందర్ పేరు బలంగా వినిపిస్తోంది. అసలు ఆయనకే కేంద్రమంత్రి పదవి వస్తుందని అంతా ఆశించారు. కానీ అలా జరగలేదు. కానీ ఈటలకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరుంది. ఉద్యమనాయకుడు. అలాంటి వ్యక్తికి పార్టీ పగ్గాలు ఇస్తే పార్టీకి ప్లస్ అవుతుందని అంతా భావిస్తున్నారు. పోటీలో ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు లాంటి వారు ఉన్నా సరే.. రాష్ట్ర వ్యాప్తంగా మంచి పట్టున్న బీసీ నేత అయిన ఈటలకే ఇవ్వాలని చూస్తున్నారు.