ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు

ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు

ఈ నెల 21 వరకు రిమాండ్
9 పుస్తకాలు కావాలన్న కవిత

విశ్వంభర, ఢిల్లీః  ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఏ విషయంలో కూడా ఆమెకు ఊరట లభించట్లేదు. మధ్యంతర బెయిల్ కోసం ఎన్ని పిటిషన్లు వేసినా కోర్టుల్లో తిరస్కరణకు గురవుతున్నాయి. ఇప్పటికే ఆమె రిమాండ్ ను పలుమార్లు కోర్టులు పొడిగిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. 

ఇప్పుడు తాజాగా మరో షాక్ తగిలింది ఆమెకు. కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను మరో రెండు వారాల పాటు పొడిగించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు. కాగా సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను రౌస్‌ అవెన్యూ న్యాయస్థానం అంగీకరించింది. ఈ నెల 21 వరకు కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను పొడిగించారు. అయితే తాను చదువుకోవడానికి 9 పుస్తకాలు కావాలని కవిత కోరగా వాటికి అంగీకరించింది కోర్టు. తదుపరి విచారణను జూన్ 21వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. అదే రోజు సీబీఐ చార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది.

Read More జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి