హైదరాబాద్‌లో చుడీదార్ గ్యాంగ్ హల్‌చల్...! 

హైదరాబాద్‌లో చుడీదార్ గ్యాంగ్ హల్‌చల్...! 

చెడ్డీ గ్యాంగ్ దొంగతనాల గురించి మనం తరచూ వినే ఉంటాం. వీరి గురించి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిక్కర్లు, బనియన్లు మాత్రమే ధరించి చోరీలకు పాల్పడటం ఈ ముఠా ప్రత్యేకత.

చెడ్డీ గ్యాంగ్ దొంగతనాల గురించి మనం తరచూ వినే ఉంటాం. వీరి గురించి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిక్కర్లు, బనియన్లు మాత్రమే ధరించి చోరీలకు పాల్పడటం ఈ ముఠా ప్రత్యేకత. అయితే, తాజాగా హైదరాబాద్‌లోని శివారు ప్రాంతాల్లో ఇప్పుడు చెడ్డీ గ్యాంగ్ తరహాలోనే చుడీదార్ గ్యాంగులు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌లోని ఎస్ఆర్‌నగర్.. జెక్ కాలనీలో వెంకటేశ్వరరావు, ఆకృతి ఆర్కేడ్ అపార్ట్ మెంట్‌లో నివాసం ఉంటున్నారు. చుడీదార్ ధరించిన దొంగలు ఆయన ఇంట్లోకి చొరబడి రూ.1 లక్ష నగదు, ఒక ల్యాప్ ట్యాప్, నాలుగు తులాల బంగారం ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అపార్ట్‌మెంట్ సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More కరకట్ట నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి:గ్రామసభలో సీపీఎం డిమాండ్

 

cr-20240520tn664b211022a98