ప్రభుత్వ పాఠశాలలో పిల్లలతో కలిసి క్రికెట్ ఆడిన పాట్ కమిన్స్!
ఎస్ ఆర్ హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ తాజాగా ఓ ప్రభుత్వ పాఠశాలలో సందడి చేశారు. ఈయన ప్రభుత్వ పాఠశాలకు వెళ్లడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడటంతో ఇందుకు సంబంధించిన ఈ వార్త కాస్త వైరల్ గా మారింది. పాట్ కమిన్స్ సరూర్ నగర్ లోని కర్మన్ ఘాట్ లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లారు.
అక్కడికి చేరుకున్నటువంటి ఈయన అక్కడ పిల్లలతో సరదాగా ముచ్చటిస్తూ సందడి చేశారు. అనంతరం వారితో కలిసి క్రికెట్ ఆడారు. ఇకపోతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ఐపీఎల్ మ్యాచ్లలో భాగంగా ఎస్ఆర్ హెచ్ ప్లే ఆప్స్ కి వెళ్లడంతో ఈసారి కప్పు తప్పకుండా గెలుస్తుందని అక్కడ విద్యార్థులు ఆయనకు తెలియచేయడమే కాకుండా ఆల్ ద బెస్ట్ కూడా తెలిపారు..
ఇకపోతే ఇటీవల కురిసినటువంటి వర్షాలు కారణంగా మ్యాచ్ రద్దు అయిన విషయం తెలిసిందే. ఇలా మ్యాచ్ రద్దు కావడంతో పాట్ కమిన్స్ సరదాగా ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి అక్కడ పిల్లలతో సమయం గడిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.