వారసత్వపు పన్ను ఔరంగజేబు విధించిన జిజియా పన్ను లాంటిది : యోగీ ఆదిత్యనాథ్

వారసత్వపు పన్ను ఔరంగజేబు విధించిన జిజియా పన్ను లాంటిది : యోగీ ఆదిత్యనాథ్

విశ్వంభర, వెబ్ డెస్క్ : వారసత్వ పన్ను ప్రవేశపట్టాలనే ప్రతిపాదన నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా మాలేగావ్ పట్టణంలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆత్మ కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించిందన్నారు. వారసత్వపు పన్ను ఔరంగజేబు విధించిన జిజియా పన్ను లాంటిదని అభివర్ణించారు.

ముస్లిమేతర పౌరులపై ఔరంగజేబు జిజియా పన్ను విధించారని గుర్తు చేశారు. బీజేపీ కేవలం అధికారం కోసమే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడం కోసమేనని తెలిపారు. మోడీ మరోసారి ప్రధాని అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదని నొక్కి చెప్పారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజల మనోభావాలకు ప్రతీక అని కొనియాడారు.

Read More తిరిగి మన మూలాల్లోకి వెళ్దాం:వెంకయ్య నాయుడు

Related Posts