చైల్డ్ ట్రాఫికింగ్ కేసు కోసం ఢిల్లీకి తెలంగాణ పోలీసులు!

చైల్డ్ ట్రాఫికింగ్ కేసు కోసం ఢిల్లీకి తెలంగాణ పోలీసులు!

తెలంగాణలో సంచలనంగా మారిన చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై పోలీసులు ఫోకస్ చేశారు. చిన్నారులను అమ్మకానికి పెడుతున్న ముఠా కోసం రాచకొండ పోలీసులు ఢిల్లీకి వెళ్లారు. ఈ కేసులో కిరణ్, ప్రీతి అనే ఇద్దరు కీలక సూత్రధారులను పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకూ 50 మంది చిన్నారులను ఈ ముఠా అమ్మేసినట్టు తేల్చారు. ఇటీవల పోలీసులు 16 చిన్నారును కాపాడి సీడబ్ల్యూసీకి తరలించారు. ఈ కేసులో 11 మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. పిల్లలను ఎక్కడ నుంచి తీసుకొని వస్తున్నారు? ఇందంతా ఎవరు చేస్తున్నారనే దానిపై ఫోకస్ చేశారు. చిన్నారులను విక్రయిస్తున్న ముఠాల కోసం ఢిల్లీలో కోసం గాలింపు చేస్తున్నారు.  

 

Read More ప్రభుత్వ, ప్రైవేట్  బ్యాంకుల్లో భద్రతపై   పోలీసుల తనిఖీ

చిన్నారుల విక్రయ వ్యవహారం మేడిపల్లిలో వెలుగులోకి వచ్చింది. పీర్జాదిగూడలో 5 రోజుల క్రితం రూ. 4.50 లక్షలకు ఆర్ఎంపీ డాక్టర్ శోభారాణి శిశువును విక్రయించారు. అప్పుడే శోభారాణితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. చైల్డ్ ట్రాఫికింగ్ గుట్టు బయటపడింది. ఢిల్లీ, పుణె నుంచి చిన్నారులను తీసుకువచ్చి అమ్ముతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ముఠా తల్లిదండ్రల నుంచి పిల్లలను కొనుగోలు చేసి.. రూ. 1.80 లక్షల నుంచి రూ. 5.50 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు రాచకొండ సీపీ తెలిపారు.