‘పుష్ప 2’ నుంచి సిద్ధప్ప పోస్టర్ విడుదల!
పుష్ప 2’ నుంచి రావు రమేశ్ బర్త్ డే సందర్భంగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో ఆయన సిద్ధప్పగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా పుష్ప- 2ను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్‌లో భారీ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ సింగల్.. పుష్ప పుష్ప సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే, తాజాగా ‘పుష్ప 2’ నుంచి రావు రమేశ్ బర్త్ డే సందర్భంగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో ఆయన సిద్ధప్పగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 15న ఈ మూవీ విడుదల కానుంది.