పోలీసులపై ప్రముఖ హీరోయిన్ ఫైర్…వీడియో వైరల్

పోలీసులపై ప్రముఖ హీరోయిన్ ఫైర్…వీడియో వైరల్

విశ్వంభర, సినిమా : సినీనటి నివేథ పేతురాజ్ అంటే సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేదు. మెంటల్ మదిలో అంటూ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన నివేదా..చివరిసారి విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ లో కనిపించారు. అయితే తాజాగా ఈ అమ్మడు కారులో ప్రయాణిస్తుండగా పోలీసులు ఆపి డిక్కీ ఓపెన్ చేయాలని కోరారు. దానికి ఆమె అంగీరించకపోగ కోపంగా మాట్లాడారు. " దగ్గర పేపర్స్ అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. కావాలంటే చెక్  చేసుకోండి. డిక్కీలో ఏం లేవు. అర్ధం చేసుకోండి. ఇది పరవుకు సంబంధించిన విషయం. ఇప్పుడు చెప్పినా మీకు అర్ధం కాదు. నేను డిక్కీ ఓపెన్ చేయలేను" అని పోలీసులతో వాగ్వాదానికి దిగింది. అయితే ఇదంతా రికార్డ్ చేస్తున్న వ్యక్తి పై ఫైర్ అయ్యారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కాగా...నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. తన అప్ కమింగ్ మూవీ కోసం ఇలా ప్రాంక్ చేసి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతుండగా… మరికొంత మంది కావాలనే ఇలా చేశారని కామెంట్స్ చేస్తున్నారు.

Related Posts