జూనియర్ ఎన్టీఆర్‌పై నయనతార ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

జూనియర్ ఎన్టీఆర్‌పై నయనతార ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో నయన్ తారక్ డాన్స్ గురించి క్రేజీ కామెంట్స్ చేసింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ గురించి లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించింది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో నయన్ తారక్ డాన్స్ గురించి క్రేజీ కామెంట్స్ చేసింది. తాను చాలా మందిని చూశానని.. డ్యాన్స్ చేయాలంటే ముందు రిహార్సిల్స్ చేసి ఆతర్వాత డాన్స్ చేస్తుంటారని తెలిపింది.

అయితే తనకు తెలిసి తారక్ ఒక్కడే రిహార్సిల్స్ లేకుండా కేవలం ఒక్కసారి చూసి డాన్స్ చేసేస్తాడని తెలిపింది. అది ఎలాంటి మూమెంట్ అయినా సరే తారక్ అవలీలగా చేసేస్తాడంటూ ప్రశంసలు కురించింది నయన్. ఈ కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్‌తో కలిసి నయన్ ‘అదుర్స్’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. 

ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్‌తో పాటు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వికపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

https://www.instagram.com/reel/C5FYtE4pzDJ/?utm_source=ig_embed&ig_rid=a60571e7-511e-4daa-8a9e-81ff73506bec

Related Posts