సీఎం రేవంత్‌రెడ్డి‌తో బాలయ్య భేటీ..!

సీఎం రేవంత్‌రెడ్డి‌తో బాలయ్య భేటీ..!

హైదరాబాద్‌లోని సీఎం నివాసానికి వెళ్లి  ముఖ్యమంత్రి అయిన సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీ సహా పలు అంశాలపై చర్చించారు.

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో టీడీపీ ఎమ్మెల్యే, నటసింహం నందమూరి బాలకృష్ణ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని సీఎం నివాసానికి వెళ్లి  ముఖ్యమంత్రి అయిన సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీ సహా పలు అంశాలపై చర్చించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక వీరిద్దరూ భేటీ కావడం ఇదే తొలిసారి. 

మొన్నటి దాకా ఏపీలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడి ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన హైదరాబాద్ వచ్చి ఇప్పుడు మళ్ళీ బసవతారకం ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలతో పాటు సినిమాల్లో నిమగ్నమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో బాలయ్యతో పాటు బసవతారక కేన్సర్ ఆస్పత్రికి చెందిన పలువురు ఉన్నారు. కొంతకాలంగా ఆ ఆస్ప్రతిని విస్తరించాలని బాలయ్య అనుకుంటున్నారు. ఈ విషయంపైనే సీఎంతో చర్చించినట్లు సమాచారం. 

Read More మాస్టర్ కారింగు రవికి ఘనంగా సన్మానం

ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ శివారులో స్థలం కేటాయింపుస‌హా ఇత‌ర అనుమ‌తుల విష‌యంపై సీఎం రేవంత్‌ను నేరుగా క‌లిసి ఉంటార‌ని చ‌ర్చసాగుతోంది. అదేస‌మ‌యంలో హైదరాబాద్‌లోని రామ‌కృష్ణా సినీ స్టూడియోస్‌ను ఆధునీకరించ‌నున్నారు. దీనిని మ‌ణికొండకు షిఫ్ట్ చేయాల‌ని నిర్ణ‌యించారు. దీనిపైనా సీఎంకు స‌మాచారం అందించి త‌గు విధంగా భూమిని కోరిన‌ట్లు తెలుస్తోంది.