మూవీ లవర్స్‌కి బంపరాఫర్.. రూ.99కే మల్టీఫ్లెక్స్‌లో సినిమా

మూవీ లవర్స్‌కి బంపరాఫర్.. రూ.99కే మల్టీఫ్లెక్స్‌లో సినిమా

మూవీ లవర్స్‌కి మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. రూ.99 రూపాయలకే సినిమా చూడొచ్చని ప్రకటించింది. అయితే, సినిమా లవర్స్ డే సందర్భంగా ఈ నెల 31న ఈ ఆఫర్ వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా ఏ భాష సినిమా అయినా, ఏ షో అయినా ఆడియన్స్ ఈ ఆఫన్ ను వినియోగించుకోవచ్చని ప్రకటించింది. 

 

Read More తెలంగాణ రాష్ట్రం తెచ్చింది విద్యార్థులు, ఉద్యోగులే : డాక్టర్ పిడమర్తి రవి 

పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్ లాంటి చైన్లతోపాటు దేశంలో 4 వేలకుపైగా ఉన్న స్క్రీన్లలో ఇదే టికెట్ ధర అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇటీవల ఎక్కువ మంది ఓటీటీలకే అలవాటు పడ్డారు. థియేటర్లకు వెళ్లకుండా ఇంట్లోనే సినిమాలు చూస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చి ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు రప్పించడానికి మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.

 

Read More తెలంగాణ రాష్ట్రం తెచ్చింది విద్యార్థులు, ఉద్యోగులే : డాక్టర్ పిడమర్తి రవి 

ఈ ఆఫర్ ఇవ్వడానికి మరో కారణం కూడా ఉంది. ప్రస్తుతం దేశం మొత్తం ఎన్నికల హడావుడిలో ఉంది. దీనికి తోడు ఐపీఎల్ సీజన్ కూడా. దీంతో.. సినిమాలపై ఆడియన్స్ ఇంట్రస్ట్ చూపించడం లేదు. అందుకే పెద్దగా సినిమాలు కూడా రిలీజ్ కాలేదు. టాలీవుడ్, బాలీవుడ్ సహా ఎక్కడా పెద్ద హీరోల సినిమాలేవీ విడుదల కాలేదు. విడుదలైన చిన్న సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. హాలీవుడ్ సినిమాలు కూడా పరిమితంగానే విడుదల కావడంతో టికెట్ సేల్స్ దారుణంగా పడిపోయాయి. దీంతో.. మల్టీప్లెక్స్ అసోసియేషన్ టికెట్లపై డిస్కౌంట్ ప్రకటించింది.

 

Read More తెలంగాణ రాష్ట్రం తెచ్చింది విద్యార్థులు, ఉద్యోగులే : డాక్టర్ పిడమర్తి రవి 

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మిస్టర్ అండ్ మిసెస్ మహి, ఛోటా భీమ్ అండ్ ద కర్స్ ఆఫ్ డమ్ యాన్, హైక్యూ ద డంప్ స్టర్ బ్యాటిల్ లాంటి సినిమాలు ఈ నెల 31న రిలీజ్ అవుతున్నాయి. మరి మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్ట్రాటజీ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.