సబ్జా నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

సబ్జా నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

రోజూ ఒక గ్లాస్ సబ్జా గింజల నీళ్లు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సబ్జా గింజలు, వీటిని తులసి గింజలు లేదా చియా గింజలు అని కూడా అంటారు.

రోజూ ఒక గ్లాస్ సబ్జా గింజల నీళ్లు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సబ్జా గింజలు, వీటిని తులసి గింజలు లేదా చియా గింజలు అని కూడా అంటారు. పోషకాలతో నిండిన చిన్న నల్లటి గింజలు. వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఇంకా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

సబ్జా గింజలలో పాలీసాకరైడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థలో మృదువైన జెల్‌గా మారతాయి. దీంతో మలబద్ధకం నివారించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. సబ్జా గింజలు చాలా సమయం వరకు కడుపు నిండిన భావన కలిగేలా చేస్తాయి. ఈ గింజలు అతిగా తినడాన్ని నియంత్రించడంలో, బరువు తగ్గడంలోనూ తోడ్పడుతాయి. 

సబ్జా గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. టైప్ 2 మధుమేహం ఉన్నవారికి ఇవి చాలా బెనిఫిట్. సబ్జా గింజలలో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి. రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.

సబ్జా గింజలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఇది ముడతలు, చర్మం సడలడం వంటి వృద్ధాప్య సంకేతాలను నివారించడంలోనూ ది బెస్ట్ అని చెప్పవచ్చు. 

అలాగే. సబ్జా గింజలలో ఐరన్, మెగ్నీషియం, విటమిన్ B కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. సబ్జా గింజలలో కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలోనూ.. ఆస్టియోపొరోసిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

Related Posts