అమెరికాలో తొలి తెలుగు జడ్జిగా జయ బాదిగ నియామకం
తెలుగు మహిళ జయ బాదిగకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంట్ కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా ఆమె నియమితులయ్యారు.
తెలుగు మహిళ జయ బాదిగకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంట్ కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా ఆమె నియమితులయ్యారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి కాలిఫోర్నియాలో జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా నిలిచారు.
కాగా, 2022 నుంచి ఇదే కోర్టులో ఆమె కమీషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఏపీలోని విజయవాడకు చెందిన జయ... హైదరాబాద్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం అమెరికా వెళ్లిన ఆమె బోస్టన్ యూనివర్సిటీలో ఎంఏ చేశారు. ఆ తర్వాత శాంటా క్లారా విశ్వవిద్యాలయం నుంచి లా పట్టా పొందారు.
2009లో కాలిఫోర్నియా స్టేట్ బార్ ఎగ్జామ్ క్లియర్ చేశారు. 10 ఏళ్లకు పైగా న్యాయవాద వృత్తిలో ప్రైవేట్ ప్రాక్టీస్‌లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో లాభాపేక్ష లేకుండా పలు కేసుల్లో ప్రభుత్వం తరఫున వాదించారు. అదేవిధంగా మెక్‌జార్జ్ స్కూల్ ఆఫ్ లాలో అధ్యాపకురాలిగానూ జయ బాదిగ పని చేశారు.