ఏపీ పెన్షన్ దారులకు గుడ్ న్యూస్... 

ఏపీ పెన్షన్ దారులకు గుడ్ న్యూస్... 

సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో సంక్షేమ పథకాలు అమలు నిధుల విడుదలకు అడ్డుకట్ట పడింది.

విశ్వంభర, వెబ్ డెస్క్  : సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో సంక్షేమ పథకాలు అమలు నిధుల విడుదలకు అడ్డుకట్ట పడింది. అయితే ప్రస్తుతం పోలింగ్ ముగిసినందున డీబీటీ పథకాలకు అధికరాలు నిధులు విడుదల చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఆసరా పథకాలనికి రూ.1,480 కోట్లు, జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజ్ రింబర్స్ మెంట్ కోసం రూ.502 కోట్లు విడుదలయ్యాయి. దీంతో లబ్ధిదారులకు అందజేస్తున్న నగదు బదిలీ పక్రియ పున : ప్రారంభమైంది.

అదే విధంగా పథకాలకు కూడా మరో రెండు రోజుల్లో నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కాగా, జనవరి నుంచి మార్చి వరకు ఆరు పథకాలకు సంబంధించి రూ. 14 వేల కోట్లను ప్రభుత్వం లబ్ధిదారులకు విడుదల చేసింది. ఎన్నికలు దగ్గరికి రాగనే నగదు విడుదల చేయకుండా అధికార పార్టీ తీరా పోలింగ్ వరకు చూశారని, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే అందరీ ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమయ్యారని టీడీపీ ఆరోపించింది. ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేయగా... వారు నిధుల విడుదలను పోలింగ్ అయ్యేంత వరకు విడుదల చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికలు ముగిసిన అనంతరం విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

Related Posts