హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీపై సుప్రీం ఆదేశాలు

విశ్వంభర, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గల 400 ఎకరాల భూమి పై తెలంగాణ ప్రభుత్వం చర్య తీసుకోవడంపై అక్కడ అడవిలో ఉన్న ప్రాంతంలో అనేక జీవరాసులు నివసిస్తుండటం వాటికి ఆశ్రయం కోల్పోవడం పై విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు గత వారం రోజుల నుంచి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు.
విద్యార్థులు కేసులకు భయపడకుండా అరెస్టులకు వెనుకడుగు వేయకుండా చేసే ఈ ధర్నా కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీలు కూడా తమ మద్దతును తెలుపుతున్నాయి... ఈ సమయంలో... రాష్ట్ర ప్రభుత్వం 30 ఏళ్లుగా హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని భూములు ఎడ్యుకేషన్ లో ఉన్నాయని ఈ భూమికి సంబంధించి విశ్వవిద్యాలయానికి ఎటువంటి అధికారం లేదని సుప్రీంకోర్టుకు విన్నవించింది.
అయితే ఇదే విషయంపై ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సుప్రీంకోర్టుకు కొన్ని దాఖలు నమోదయ్యాయి.. ఆ ప్రాంతంలో నివసిస్తున్న వన్యప్రాణుల కోసం వాటికి కొంత భూమిని కేటాయించాలని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేసును నమోదు చేశారు. ఈ పిల్ ను స్వీకరించిన సుప్రీంకోర్టు అక్కడ నరికి వేస్తున్న చెట్లను వెంటనే ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా గచ్చిబౌలిలోని ఆ భూములను ఎలాంటి చర్యలు తీసుకోకుండా చెట్లను నరికి వేయకుండా వెంటనే పని ఆపాలంటూ తెలంగాణ సిఎస్ ను గట్టిగా వారించింది సుప్రీంకోర్టు...
దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విక్రయించాలనుకున్న భూములను సందర్శించి వెంటనే దానికి సంబంధించిన రిపోర్టును తమకు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతవరకు ఈ భూములపై ఎలాంటి చర్యలకు పాల్పడో ద్దని సుప్రీమ్ తెలంగాణ సిఎస్ కు హెచ్చరికలు జారీ చేసింది....