బ్లడ్ డొనేషన్ సర్టిఫికెట్స్ అందజేత

విశ్వంభర, ఎల్బీనగర్ : బియన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని వైదేహి నగర్ కాలనీ మదర్ థెరిసా చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు చేపూరి శంకరయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా రక్తదానం చేసిన వారికి గవర్నర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వారి సర్టిఫికెట్లను ముఖ్యఅతిథిగా బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి, గౌరవ అతిధి పూర్వ సివిల్ సప్లై డిస్టిక్ మేనేజర్ కట్ట బాలరాజు , సభాధ్యక్షులు ప్రముఖ కవి, రచయిత, మహాత్మా గాంధీ లా కాలేజ్ ఈసీ మెంబర్ ,తెలుగు శాఖ అధ్యక్షులు, సిటీ కళాశాల డాక్టర్ కోయ కోటేశ్వరరావు లతో కలిసి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రక్తదాన శిబిరం ఏర్పాటుచేసిన మదర్ థెరీసా చారిటబుల్ ట్రస్ట్ సొసైటీ వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ రక్తదానం చెయ్యాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అనంతరం రక్తదానం చేసిన వారికి గవర్నర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ తరపున జారీ చేసిన సర్టిఫికెట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మదర్ థెరిసా చారిటబుల్ సొసైటీ సభ్యులు, సునీత, సుజాత, మేరీ, ఉమా, యోగిత, రాజు, సంతోష్, కిరణ్ మరియు తదితరులు ఉన్నారు.