మానవసేవయే.. మాధవసేవ - చండూరు సిఐ ఆదిరెడ్డి
ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ ఆశయం
.jpeg)
- ఆర్థికంగా ఉన్నవారు నిరుపేదలను ఆదుకోండి.
- గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ
విశ్వంభర, చండూర్ : మానవసేవయే మాధవ సేవ అని నిరుపేదలకు సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్లు అని చండూర్ సీఐ ఆదిరెడ్డి అన్నారు. గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో చండూర్ సిఐ , ఎస్సై లు ముఖ్య అతిధులుగా పాల్గొని నిరుపేద వృద్దులకు గాంధీజీ విద్యా సంస్థల్లో వారి చేతుల మీదుగా పంపిణి చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు తలపెట్టిన ఈ మహోత్తరమైన కార్యక్రమం ద్వారా నిరుపేద వృద్ధులను ఆదుకోవడం అంటే గొప్ప విషయమని అన్నారు. గాంధీజీ ఫౌండేషన్ ఇంకా ఎక్కువ మందికి సేవ చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని, రాబోయే రోజుల్లో గాంధీజీ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవలు పేద ప్రజలకు అందాలని ఆశించారు. కోడి శ్రీనివాసులును ఆదర్శంగా తీసుకొని సమాజంలో మరికొంతమంది ముందుకు వచ్చి నిరుపేదలను ఆదుకోవాలని సూచించారు. నాలుగు పైసలు సంపాదిస్తే అయినవారిని మర్చిపోతున్న నేటి రోజుల్లో తన కండ్ల ముందు పేదరికంతో అల్లాడుతున్న వారికి ఆసరాగా ఉండాలన్న ధ్యేయంతో డాక్టర్ కోడి శ్రీనివాసులు స్థాపించిన గాంధీజీ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని అన్నారు. రెండు సంవత్సరములు వరకు ప్రతినెల 30 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు గత సంవత్సరం జనవరి నెల ఒకటో తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో "నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ" కార్యక్రమం గురువారం నాడు స్ధానిక గాంధీజీ విద్యాసంస్థల యందు 16వ నెల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు, గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్స్ సత్యనారాయణమూర్తి, పులిపాటి రాధిక, బుషిపాక యాదగిరి, బోడ విజయ్, గోపి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.