దిల్ సుఖ్ నగర్ లో భారీగా ట్రాఫిక్ జామ్
ఎల్బీనగర్ నుండి దిల్సుఖ్నగర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్
On

- ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్సు
విశ్వంభర, హైదరాబాద్ : హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో కుండపోత వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి కుండపోత వర్షం కురవడంతో చాలా వరకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దాదాపు గంటకు పైగా కురిసిన వర్షానికి చైతన్యపురి లో మెయిన్ రోడ్డుపై వర్షం నీరు ప్రవహిస్తూ రాకపోకలకి ఇబ్బందిగా మారింది. వాహనదారులు సైతం నీటి ప్రవాహంలో నుండే వెళ్తున్నారు. వర్షపు నీరు రోడ్డుపై చేరడంతో వాహనాలు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎల్బీనగర్ నుండి దిల్సుఖ్నగర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడం తో వాహనదారులు ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ట్రాఫిక్ జామ్ లో అంబులెన్సు వాహనం చిక్కుకపోవడంతో తోటి వాహనదారులు అంబులెన్సు కి దారి ఇవ్వడం జరిగింది.